మీ గుండెకు స్టంట్ వేశారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TeluguStop.com
గుండెకు స్టంట్ పడింది రా!.ఈ మధ్య కాలంలో ఎవరి నోట చూసినా ఇదే మాట వినిపిస్తోంది.
ఒకప్పుడు గుండె జబ్బుల బాధితులు చాలా అరుదుగా ఉండే వారు.కానీ, ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది హార్ట్ ఎటాక్, కరోనరీ హార్ట్ డీసీస్, కార్డియక్ అరెస్ట్ వంటి గుండె సంబంధిత వ్యాధులతో తీవ్రంగా మదన పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఎందరో ప్రాణాలు సైతం విడుస్తున్నారు.గుండెకు తగిన మోతాదులో రక్తం సరఫరా అవ్వకుండా రక్తనాళాల్లో గడ్డకట్టినప్పుడు ఆయా సమస్యలు వస్తుంటాయి.
అప్పుడే హార్ట్‌కి స్టంట్ వేస్తారు.దాంతో మూసుకుపోయిన గుండె రక్తనాళాలు తెరుచుకుని.
మళ్లీ యథావిధిగా రక్తం సరఫరా అవుతుంది.అయితే గుండెకు స్టంట్ వేయించుకున్న వారు మునుపటి మాదిరి ఉండటం కుదరు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.అలాగే హార్ట్ స్టంట్ వేయించుకున్న వారు తప్పనిసరిగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి.
డైట్‌లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.
ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్‌లో వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేయబడిన మాంసం, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.