పాతికేళ్లకే తెల్ల జుట్టు మొద‌లైందా? అయితే మీరీ విష‌యాలు తెలుసుకోండి!

ఒక‌ప్పుడు అర‌వై, డ‌బ్బై ఏళ్లు పైబ‌డిన వారికే జుట్టు తెల్ల‌బ‌డేది.కానీ, నేటి రోజుల్లో పాతికేళ్ల‌కే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

మీరూ ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.

అవేంటంటే.జుట్టులో మెల‌నిన్ ఉంటుంది.

ఇది జుట్టు న‌ల్ల‌గా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.మెల‌నిన్‌ ఉత్ప‌త్తి ఎప్పుడైతే త‌గ్గిపోతుందో.

అప్ప‌టి నుంచి న‌ల్ల‌గా ఉండాల్సిన జుట్టు తెల్ల‌గా మారుతుంది.కాబ‌ట్టి, యంగ్ ఏజ్‌లో తెల్ల జుట్టు వ‌స్తుంటే మెల‌నిన్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంద‌ని గ్ర‌హించాలి.

మ‌రి ఇంత‌కీ జుట్టులో మెల‌నిన్ ఉత్ప‌త్తిని పెంచుకోవ‌డం ఎలా.? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.

అది తెలియాలంటే ఆల‌స్యం చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.కొన్ని కొన్ని ఆహారాలు మెల‌నిన్ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అటువంటి వాటిలో సిట్ర‌స్ పండ్లు ఒక‌టి.నిమ్మ‌, నారింజ‌, కమ‌ల‌, బొప్పాయి, ఉసిరి, స్ట్రాబెర్రీలు వంటి వాటిని త‌ర‌చూ తీసుకుంటే మెల‌నిన్ ఉత్ప‌త్తి పెరిగి జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

అలాగే పాల‌కూర‌, క్యారెట్‌, చిల‌గ‌డ‌దుంప‌లు, బ్రోక‌లీ, కాలీఫ్లెవ‌ర్ వంటి కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉండాలి.

ఎందుకంటే జుట్టులో మెల‌నిన్ ఉత్ప‌త్తిని పెంచే పోష‌కాలు ఈ కూర‌గాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి.

"""/"/ డార్క్ చాక్లెట్‌.మెల‌నీన్ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.

ప్ర‌తి రోజు తగిన మోతాదులో డార్క్ చాక్లెట్‌ను తింటే గ‌నుక జుట్ట తెల్ల బ‌డ‌కుండా అడ్డుకోవ‌చ్చు.

ధూమ‌పానం అల‌వాటు ఉంటే ఖ‌చ్చితంగా మానుకోవాలి.ఎందుకంటే పొగాకు ఉత్ప‌త్తులు ఆరోగ్యానికే కాదు జుట్టుకు తీవ్ర హాని క‌లిగించి.

త్వ‌ర‌గా వైట్ హెయిర్ వ‌చ్చేలా చేస్తాయి.అందువ‌ల్ల‌, మీ జుట్టు న‌ల్ల‌గా మెర‌వాలంటే స్మోకింగ్‌కు పులిస్టాప్ పెట్టేయండి.

ఇక హెయిర్ స్ట్రెయిటనర్లు వాడ‌టం త‌గ్గించాలి.ఎందుకంటే, అధిక వేడి జుట్టులో మెల‌నిన్ ఉత్ప‌త్తిని త‌గ్గించేస్తుంది.

దాంతో యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు వ‌స్తుంది.కాబ‌ట్టి, హెయిర్ స్ట్రెయిటనర్లకు కాస్త దూరంగా ఉంటే మంచిది.

ఆ స్టార్ హీరోలకు ధీటుగా మోక్షజ్ఞ సక్సెస్ కావడం సాధ్యమేనా.. చరణ్ తర్వాత ఇతనేనంటూ?