ఒక్క‌ రోజులో మొటిమల‌ను మ‌టుమాయం చేసే సింపుల్ చిట్కాలు ఇవే!

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ప్ర‌ధానంగా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు ఒక‌టి.అధిక ఎండ‌లు, ఉక్క‌పోత కార‌ణంగా చెమ‌ట‌లు ప‌ట్టిసి ముఖం త‌ర‌చూ జిడ్డుగా మారిపోతుంది.

దాంతో దుమ్ము, ధూళి చ‌ర్మంపై పేరుకుపోయి మొటిమ‌ల స‌మ‌స్య‌కు దారి తీస్తుంది.అలాగే ఒంట్లో వేడి ఎక్కువైనా మొటిమ‌లు వ‌స్తుంటాయి.

కార‌ణం ఏదైనప్ప‌టికీ మొటిమ‌లు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అందుకే వాటిని వ‌దిలించుకోవ‌డం కోసం ఖ‌రీదైన క్రీముల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే గ‌నుక కేవ‌లం ఒక్క రోజులోనే మొటిమ‌లు మ‌టుమాయం అవుతాయి.

మ‌రి లేటెందుకు ఈ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.మొటిమ‌ల‌ను వేగంగా త‌గ్గించ‌డంలో ఆవాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అందుకోసం వ‌న్ టేబుల్ స్పూన్ ఆవాల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఈ ఆవాల పొడిలో ఒక‌టి లేదా రెండు రేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని రాత్రి నిద్రించే ముందు మొటిమ‌ల‌పై అప్లై చేసి ప‌డుకోవాలి.ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ఒక రోజులో మొటిమ‌లు త‌గ్గిపోతాయి. """/" / అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ల‌ చంద‌నం పొడి, రెండు టేబుల్ స్పూన్ల‌ ట‌మాటో జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్‌వాట‌ర్, చిటికెడు క‌స్తూరి ప‌సుపు వేసుకుని బాగా క‌లిపి మొటిమ‌లపై పూయాలి.

పూర్తిగా ఆరిపోయిన త‌ర్వాత వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక బియ్యం క‌డిని నీటిని ఒక స్ప్రై బాటిల్ లో నింపి.రోజుకు మూడు, నాలుగు సార్లు మొటిమ‌లు ఉన్న చోట స్ప్రే చేస్తూ ఉంటాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల బియ్యం నీటిలో ఉండే కొన్ని ప్ర‌త్యేక సుగుణాలు మొటిమ‌ల‌ను సూప‌ర్ ఫాస్ట్‌గా త‌గ్గించేస్తాయి.

Validation Check 2026-03-24 19:38:18