ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
TeluguStop.com
సాధారణంగా ఒక్కోసారి ఆగకుండా తుమ్ములు( Sneezing ) వస్తుంటాయి.ఊపిరితిత్తుల్లోని గాలిని ముక్కు, నోరు ద్వారా ఒక్కసారిగా బయట కు పంపి వేసే చర్యనే తుమ్ము అంటారు.
దుమ్ము, ధూళి, జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్, పొగ, కాలుష్యం, ఫుడ్ అలర్జీ, చల్లగాలి తదితర అంశాలు తుమ్ములు రావడానికి కారణం అవుతుంటాయి.
ఏదేమైనా ఆగకుండా తుమ్ములు వస్తుంటే ఎంతో ఇబ్బంది పడుతుంటారు.తీవ్రమైన తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలను పాటిస్తే సులభంగా మరియు వేగంగా తుమ్ములకు చెక్ పెట్టవచ్చు.
తులసి ఆకులు( Tulsi Leaves ) తుమ్ములను ఆపడంలో ఉత్తమంగా హెల్ప్ చేస్తాయి.
కొన్ని ఫ్రెష్ తులసి ఆకులను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ లో పది నిమిషాల పాటు మరిగించి వడకట్టాయి.
ఇప్పుడు ఈ వాటర్ లో కొద్ది తేనె( Honey ) కలిపి తీసుకుంటే తుమ్ములు దెబ్బకు కంట్రోల్ అవుతాయి.
"""/" /
ఆడకుండా తుమ్ములు వస్తున్నప్పుడు వేడినీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ లేదా పుదీనా ఆకులు వేసి ఆవిరిని పీల్చండి.
తద్వారా ముక్కు మరియు శ్వాసనాళాల్లో దుమ్ము వల్ల ఏర్పడిన చికాకు తొలగిపోతుంది.తుమ్ముల సమస్య దూరం అవుతుంది.
పదే పదే తుమ్ములు వస్తుంటే ఒక టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూన్ ఫ్రెష్ అల్లం( Ginger ) రసం కలిపి తాగండి.
ఇది గొంతు సమస్యలను తగ్గిస్తుంది.తుమ్ములను నియంత్రించడంలో సహాయపడుతుంది.
"""/" /
కొందరు స్నానం చేశారంటే చాలు వెంటనే తుమ్ములు వచ్చేస్తుంటాయి.అయితే అలాంటి వారు వేడి పాలలో కొంచెం పసుపు వేసి రాత్రి పడుకునే ముందు తాగండి.