ఎంత ప్ర‌య‌త్నించినా హెయిర్ ఫాల్ ఆగ‌ట్లేదా..? అయితే ఈ హెర్బ‌ల్ ప్యాక్ మీకోస‌మే!

హెయిర్ ఫాల్ అనేది దాదాపు ప్రతి ఒక్కరిని సర్వసాధారణంగా వేధించే సమస్య.అయితే కొందరిలో ఈ సమస్య కాస్త అధికంగా ఉంటుంది.

దీని వల్ల ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పల్చగా మారిపోతుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఖరీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.ఒక్కోసారి ఎన్ని చేసినా ఫలితం లభించదు.

దాంతో ఏం చేయాలో తెలియ‌క తీవ్రంగా మదన పడిపోతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే హెయిర్ ఫాల్ తో డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తే.

జుట్టు రాలడానికి ఈజీగా అడ్డుకట్ట వేయొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ హెయిర్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ప‌ల్చ‌టి వస్త్రాన్ని తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి అందులో ఉండే నీరు మొత్తాన్ని తొలగించాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల త్రిఫల పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోక‌నట్ ఆయిల్ మరియు నీరు తొలగించిన పెరుగు వేసుకుని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

< -->ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.రెండు గంటల అనంతరం రసాయనాలు తక్కువగా ఉండే షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ ను ట్రై చేస్తే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే కురులు ఒత్తుగా పెరుగుతాయి.

క్లిక్ పూర్తిగా చదవండి

తలలో చుండ్రు, దురద వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

క్లిక్ పూర్తిగా చదవండి

ఇంటర్నేషనల్ విమానాల్లో ఆల్కహాల్ ఎందుకు సర్వ్ చేస్తారో తెలుసా?

ఆ సూపర్‌ స్టార్‌ మళ్లీ తెలుగు దర్శకులతో, తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందా!

ఢిల్లీ కోర్టులో శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్

మొదటి టి20 మ్యాచ్ లో ఓటమి చెందిన భారత్..!!

బాబు కన్నా జగన్ ఈ విషయంలో మేలు..!

శుక్రవారం ఉదయాన్నే రూ.2లక్షల కోట్లు కోల్పోయిన అదానీ గ్రూప్.. కారణమదే??