బయటపడ్డ హెర్బల్ లైఫ్ మేనేజర్ చీకటి వ్యవహారాలు.. న్యూడ్ కాల్స్, అశ్లీల ఫోటోలతో..!
TeluguStop.com
ఇటీవల కాలంలో మొదట మహిళలతో పరిచయం ఏర్పరచుకొని తరువాత వివిధ రకాలుగా వేధించి లోబర్చుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు.
మొదట మంచితనం చూపించి పరిచయం ముదిరిన తర్వాత తమ నిజ స్వరూపం ఎంతో బయటపెట్టేస్తున్నారు.
ఓ కామాంధుడు ఏకంగా 20 మంది మహిళలను లోబరుచుకొనే ప్రయత్నం చేశాడు.అర్ధరాత్రి న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడడం.
పోకిరి చేష్టలతో మహిళల బాడీ పార్ట్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడడం చేసేవాడు.ఆ కామాంధుడి అసలు చరిత్ర ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే హైదరాబాద్ లోని( Hyderabad ) కేపీహెచ్బి కాలనీలో హెర్బల్ లైఫ్ మేనేజర్ చంద్రశేఖర్( Chandrasekhar ) న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఏడాది క్రితం పోలీసులు అరెస్టు చేసి, అన్ని కోణాల్లో విచారణ చేయగా అజాగా విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇతను ఏకంగా 20 మంది మహిళలను వేధింపులకు గురిచేశాడు.ఇంకా వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని కేపీహెచ్బి పోలీసులు( KPHB Police ) తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. """/" /
హెర్బల్ లైఫ్ లో( Herbal Life ) వెయిట్ లాస్ కోసం వచ్చే మహిళలను మేనేజర్ చంద్రశేఖర్ లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.
మహిళలతో మంచి వాడిలాగా పరిచయం చేసుకుని.పరిచయం కాస్త ముదిరిన తర్వాత న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడేవాడు.
వెయిట్ లాస్ కోసం వచ్చిన మహిళల మొబైల్ నెంబర్లు తీసుకొని అర్ధరాత్రి వారికి ఫోన్లు చేసి అశ్లీల ఫోటోల గురించి, మహిళల వెయిట్ లాస్ గురించి చాలా అసభ్యంగా మాట్లాడేవాడు.
"""/" /
పోలీసులు చంద్రశేఖర్ మొబైల్ ఫోన్ లో వందలకొద్దీ న్యూడ్ కాల్స్ వీడియోలు, అశ్లీల చాట్, పదుల సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లను గుర్తించారు.
ఇలాంటి విషయాలలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.బయట వ్యక్తులకు మహిళలు తమ ఫోన్ నెంబర్లు కాకుండా ఇంట్లో ఉండే మగవాళ్ళ నెంబర్లు ఇవ్వాలని, అపరిచిత వ్యక్తులతో పరిచయం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.