ప్రకాష్ రాజ్ తో ఆమె పెళ్లంటూ అప్పట్లో ప్రచారం.. కట్ చేస్తే సీన్ ఇది?
TeluguStop.com
ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పుకార్లు ఎదుర్కోవడం కామన్ అనే చెప్పాలి.ఎందుకంటే వాళ్లు మంచి హోదాలో ఉండే సరికి విమర్శకులు వాళ్ళ పై రకరకాల పుకార్లను క్రియేట్ చేస్తారు.
చాలా వరకు ఇండస్ట్రీకి చెందిన వాళ్లంతా వాళ్ల వ్యక్తిగత విషయంలో ఎన్నో పుకార్లు ఎదుర్కొన్నారు.
అందులో ఎక్కువగా పెళ్లి విషయంలో, డేటింగ్ విషయంలోనే ఎదుర్కొన్నారు.ఇదిలా ఉంటే నటుడు ప్రకాష్ రాజ్ కూడా గతంలో ఇటువంటి పుకార్లనే ఎదుర్కొన్నాడు.
ఇంతకు ఆమె ఎవరు అసలేం జరిగిందో తెలుసుకుందాం.తెలుగు సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరికీ పరిచయమే.
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.
తన నటనకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.ఎక్కువగా విలన్, సహాయ పాత్రలలో నటించాడు.
ప్రకాష్ రాజ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇద్దరు అనే సినిమాతో పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత హిట్లర్, చిరునవ్వుతో వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
నెగటివ్ పాత్ర లతో కూడా అద్భుతంగా నటించాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తండ్రి, తాత పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు ప్రకాష్ రాజ్. """/"/
ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.
తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటాడు.ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ కు రాజకీయ నాయకురాలు శోభారాణి తో పెళ్లి జరిగింది అని బాగా ప్రచారాలు వచ్చాయి.
గతంలో ఈ విషయం గురించి శోభారాణి మీడియా ముందు కూడా తెలిపింది. """/"/
గతంలో ప్రకాష్ రాజ్ తో తనకు మ్యారేజ్ అయిందని పుకార్లు వచ్చాయని తెలిపింది.
ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని తాను పని చేసింది కూడా ఓ సినిమా యాక్టర్ పెట్టిన పార్టీలో అని తెలిపింది.
దీంతో తనకు సినిమా వాళ్ళతో పరిచయం ఉండటంతో ప్రకాష్ రాజ్ తో పెళ్లి జరిగింది అని పుకార్లు సృష్టించారని తెలిపింది.
ఈ పుకారు మొత్తం వైరల్ గా మారడంతో ఈ విషయం తనను, ప్రకాష్ రాజ్ ను బాధపెట్టిందని తెలిపింది శోభారాణి.
ఇక ప్రకాష్ రాజ్ తనకు ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా జరిగింది అని ప్రశ్నించాడని ఆ సమయంలో తాను రాజకీయ నాయకులకు, ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు ఇటువంటివన్నీ కామన్ గా వస్తాయని అన్నానని తెలిపింది.
"""/"/
ఇక ప్రకాశ్ రాజ్ తనతో.మీరు సీరియస్ పొలిటిషన్ గా ఉన్నారు.
కాబట్టి ఇటువంటివి రాకుండా అడ్డుకోవాల్సిందని అన్నాడట.పైగా ఆ సమయంలో తన తల్లి హాస్పిటల్ లో ఉందని చెప్పేసరికి తను చాలా బాధ పడ్డానని తెలిపింది.
ఈ విషయాన్ని కావాలనే పెద్దగా చేసి తన జీవితం నాశనం చేయాలని అనుకున్నారట.
నిజానికి తాను ప్రకాష్ రాజ్ ను ఒక రెండు సార్లు తప్ప మరోసారి కలవలేదని ఎక్కువ పరిచయం కూడా లేదని తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం. మేకను రేప్ చేసిన కామాంధుడు.. వీడియో వైరల్..