బాహుబలి సినిమాకు రమ్యకృష్ణ పెట్టిన షరతులు ఇవే.. ఆ కండీషన్లకు జక్కన్న ఓకే చెప్పారా?

రమ్యకృష్ణ ( Ramyakrishna )సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో నరసింహ, బాహుబలి సినిమాలు ముందువరసలో ఉంటాయి.

ఈ సినిమాలు రమ్యకృష్ణకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

జైలర్ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రమ్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

నరసింహ మూవీలో ఛాన్స్ వచ్చిన సమయంలో ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా """/" / రజనీకాంత్ సినిమాలో నేను భాగం కావాలని అనుకుని ఆ సినిమాలో నటించానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

నా లైఫ్ లో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని ఆమె కామెంట్లు చేశారు.

నరసింహ మూవీలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని అనుకున్నానని రమ్యకృష్ణ కామెంట్లు చేయడం గమనార్హం.

బాహుబలి సినిమాతో మరో హిట్ దక్కిందని ఈ సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధిస్తుందని అనుకోలేదని రమ్యకృష్ణ పేర్కొన్నారు.

బాహుబలి సినిమాలో ( Bahubali Movie )నటించడానికి కొన్ని షరతులు పెట్టానని రమ్యకృష్ణ వెల్లడించారు.

రాత్రిపూట షూటింగ్ చేయనని రాజమౌళికి చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.బాహుబలి సినిమాకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఇస్తానని చెప్పానని ఆమె తెలిపారు.

నేను పెట్టిన షరతులకు రాజమౌళి అంగీకరించారని రమ్యకృష్ణ కామెంట్లు చేశారు. """/" / రజనీకాంత్, చిరంజీవి ( Chiranjeevi )స్క్రీన్ పై కనిపిస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

రమ్యకృష్ణ జైలర్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది.రమ్యకృష్ణను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇలా చేస్తే ఎలా యంగ్ టైగర్ .. ఆ టార్గెట్ ను అందుకోవడం సాధ్యమేనా?