రవితేజ హీరోయిన్ ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
TeluguStop.com
కాకిలా కలకాలం ఉండటం కంటే హంసలా ఆరు మాసాలు జీవిస్తే చాలు అంటారు పెద్దలు.
సేమ్ ఇలాగే కొందరు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు పొందరు.కానీ మరికొందరు చేసినవి తక్కువ సినిమాలే అయినా జనాల హ్రుదయాల్లో నిలిచిపోతారు.
సినిమాల్లో ఇలా వచ్చి.అలా మెరిసి వెళ్లిపోతారు.
అలాంటి హీరోయిన్లలో ఒకరు గోపిక.తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి ఫోటో బాగా వైరల్ అయ్యింది.
ఇంతకీ ఆ ఫోటో కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చింది గోపిక.
పలు చక్కటి సినిమాలు చేస్తూ జనాలకు మరింత చేరువైంది.కేరళలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.
డిగ్రీ చదివే రోజుల్లోనే హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.దీంతో తను సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.
జయసూర్య, వినీత్ తో కలిసి తొలి సినిమా చేసింది.కానీ ఆ సినిమా హిట్ కాలేదు.
కానీ తనకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత ఫర్ ద పీపుల్ మూవీ చేసి సూపర్ డూపర్ హిట్ సాధించింది.
ఇక తెలుగులో రవితేజతో తొలి సినిమా చేసింది.నా ఆటోగ్రాఫ్ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది.
ఈ సినిమాతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరయ్యింది.అనంతరం లేత మనసులు, ముద్దుల కొడుకు, వీడు మామూలోడు కాదోయ్ సహా పలు సినిమాలు చేసింది.
తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. """/"/
సినిమా కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజిలేష్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది గోపిక.
ఆ తర్వాత సినిమాకు దూరం అయ్యింది.ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి సెటిల్ అయ్యింది.
తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన ముద్దుల కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది.ఈ ఫోటోలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అటు గోపిక మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మంచి అవకాశాలు వస్తే ఎస్ చెప్పేందుకు తను కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
రైలు కంపార్ట్‌మెంట్‌లో ఇబ్బందికర సమస్య.. చిటికెలో ఫిక్స్ చేసిన మహిళ.. వీడియో చూస్తే..!