నిగ‌నిగ‌లాడే న‌ల్ల‌టి జుట్టు కావాలా? ఈ హెన్నా, కొబ్బరి పాల ప్యాక్ ట్రై చేయండి!

నిగ‌నిగ‌లాడే న‌ల్ల‌టి కురులు కావాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోస‌మే జుట్టుపై ఎన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.

కాస్ట్లీ హెయిర్ ప్రోడెక్ట్స్‌ను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.హెయిర్ ప్యాకులు వేసుకుంటారు.

అయితే మార్కెట్‌లో లభ్య‌మ‌య్యే హెయిర్ ప్యాక్స్ కంటే ఇంట్లో న్యాచుర‌ల్‌గా త‌యారు చేసుకునే ప్యాక్స్ కేశాలుకు ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో ప్ర‌యోజాల‌ను అందిస్తాయి.మ‌రి అటువంటి హెయిర్ ప్యాక్స్‌లో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ హెన్నా, కొబ్బ‌రి పాలతో త‌యారు చేసే ప్యాక్ జుట్టుకు చాలా మంచిది.

ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగైదు స్పూన్ల హెన్నా పౌడ‌ర్‌, నాలుగు స్పూన్ల కొబ్బ‌రి పాలు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు మ‌రియు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని అర గంట త‌ర్వాత గోరు వెచ్చినీ నీటితో హెడ్ బాత్ చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతుంది.అంతేకాదు, ఈ ప్యాక్ వ‌ల్ల హెయిర్ ఫాల్ స‌మ‌స్య కూడా దూర‌మై ఒత్తుగా పెర‌గ‌డం స్టార్ అవుతుంది.

అయితే హెన్నా పొడి మార్కెట్‌లోది కాకుండా ఇంట్లో త‌యారు చేసుకున్న‌దే వాడాలి.మ‌రియు ఫ్రెష్‌గా ఉండే కొబ్బ‌రి పాల‌నే యూజ్ చేయాలి.

"""/"/ అలాగే మ‌రో న్యాచుర‌ల్ హెయిర్ ప్యాక్ కోసం.ఒక గిన్నెలో మూడు లేదా నాలుగు స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ టీ పొడి స‌రిప‌డా నీరు పోసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించాలి.

గంట పాటు ఈ ప్యాక్‌ను ఉంచుకుని అనంత‌రం హెడ్ బాత్ చేయాలి.వారానికి ఒక సారి ఈ ప్యాక్ వేసుకుంటే మీ కురులు న‌ల్ల‌గా, షైనీగా మార‌తాయి.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?