నీటిలో కోడి యోగాసనం.. చనిపోయిందనుకునే లోపే!

సోషల్ మీడియాలో తరచుగా జంతువులు, పక్షుల వీడియోలు వైరల్ అవుతుంటాయి.అవి చేసే చిన్న చిన్న వేషాలు, పనులు చూస్తుంటే నవ్వొస్తుంది.

అయితే కోల్ల వీడియోలు అన్నింటి కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి .మనుషులు అంటే భయపడాల్సిన కోళ్లు.

కొన్ని సందర్భాల్లో మనుషులపైనే దాడికి దిగుతున్నాయి.మరికొన్ని సార్లు కుక్కలు, గద్దలతో పోరాడుతున్నాయి.

ఐతే తాజాగా ఓ కోడి నీటిలో నిద్రపోతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్విట్టర్ లోని @buitengebieden అకౌంట్ లో ఈ కోడి వీడియోను చూడొచ్చు.వీడియోని షేర్ చేసిన ఒక్క రోజులోనే 4.

22 లక్షల వ్యూస్ రాగా.18 వేల మంది లైక్ చేశారు.

అయితే వీడియోలో గమనిస్తే.ఓ కోడి నీటి తొట్టిలో వెల్లకిలా పడుకొని ఉంది.

చూడటానికి చనిపోయిన ఉన్నట్లు కనిపిస్తోంది.అది చూసిన ఓ వ్యక్తి నీటిని కదిపి చూశాడు.

దాంతో దానికి మెలుకువ వచ్చి.తాను నీటిలో పడుకున్నట్లు గ్రహిస్తుంది.

వెంటనే బయటకు దూకుతుంది.అితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే విపరీతంగా లైకులు కొడుతూ.కామెంట్లు చేస్తున్నారు.

దాని స్కిల్ భలే ఉందంటూ చెబుతున్నారు.కోళ్లు నీటి నిద్రపోవడాన్ని ఇష్ట పడతాయని నాకు తెలీదని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.

వామ్మో అది తిరగేసి ఉంది.చూస్తేనే భయం వేస్తుందని మరో వ్యక్తి చెప్పాడు.

మీరూ ఓ సారి చూసేయండి.