జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా..కొత్త సీఎంగా చంపై సోరెన్..!!

మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Hemant Soren ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాజ్‌భవన్‌కు చేరుకున్న తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది.

కాగా త్వరలోనే ఈడీ అతడిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.బుధవారం ఉదయం నుంచి ఈడీ విచారించడం జరిగింది.

దీంతో జార్ఖండ్‌లో( Jharkhand ) రాజకీయ పరిణామాలు ఉహించని విధంగా మారిపోయాయి.హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో.

ఆ పార్టీ శాసనసభపక్ష నేతగా ఉన్న చంపై సోరెన్ నీ నూతన సీఎంగా జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

"""/" / ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను ఆహ్వానించడం జరిగింది.దీంతో కొత్త సీఎంగా చంపైను ప్రకటించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ పరిణామంతో జార్ఖండ్‌ రాజకీయాలలో చంపై పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.జేఎంఎం సీనియర్ నేత హేమంత్ సోరెన్ కి నమ్మకస్తుడిగా చంపైకి మంచి పేరుంది.

హేమంత్ మంత్రివర్గంలో కూడా కీలక శాఖలో పని చేయడం జరిగింది.జార్ఖండ్ లో ప్రభుత్వం స్థాపించడంలో చంపై సోరెన్ కీలక పాత్ర పోషించారు.

స్వతంత్ర ఎమ్మెల్యేగా సరైకేలా నుంచి గెలిచి ఆ తర్వాత జేఎంఎంలో చేరారు.ఈ క్రమంలో అనూహ్య పరిణామాలతో సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయటంతో జేఎంఎం పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న చంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది.

సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగు పూయొద్దు: పవన్ కళ్యాణ్