తండ్రి హమాలి.. కూతురు ఎస్సై.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

లక్ష్యం గొప్పదైతే ఆ లక్ష్యం ముందు పేదరికం కూడా ఓడిపోతుంది.మహబుబాబాద్ జిల్లా( Mahabubabad ) కొత్తగూడ మండలం ఒటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన హేమలత సివిల్ ఎస్సైగా ఎంపికై ఏజెన్సీకి మంచి పేరును తెచ్చిపెట్టారు.

పేరెంట్స్ కష్టాలను చూస్తూ పెరిగిన ఈ యువతి తల్లీదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఎంతో కష్టపడి చదవడంతో పాటు సివిల్ ఎస్సై ఉద్యోగం సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

"""/" / తండ్రి కుమారస్వామి గ్రామంలో హమాలీ పని చేస్తూ ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించారు.

పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న హేమలత ఓపెన్ డిగ్రీ చేసి ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University )లో పీజీ చేసి గ్రూప్1 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు పెళ్లి వద్దనుకున్న హేమలత తనకంటే ముందు చెల్లికి పెళ్లి చేశారు.

తొలి ప్రయత్నంలోనే ఎస్సైగా ఎంపికైన హేమలత( Hemalatha ) గ్రామానికి సైతం మంచి పేరు తెచ్చిపెట్టారు.

"""/" / నిరుపేద కుటుంబానికి చెందిన హేమలత ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు సైతం సంతోషిస్తున్నారు.

తల్లీదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ హేమలత సక్సెస్ సాధించారు.

భవిష్యత్తులో హేమలత కెరీర్ కు అనుకూలంగా జరగాలని ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

హేమలత సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్న హేమలత తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంత కాలానికి దక్కిందని తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నారు.

హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇలాంటి కూతురు పుట్టినందుకు తమకెంతో సంతోషంగా ఉందని హేమలత తల్లీదండ్రులు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకుంటున్నారు.

ఎవరు ఈ జాస్మిన్ వాలియా.? హార్దిక్ పాండ్యతో సంబంధం ఏంటి.?