Hema Sharma : అలాంటి అవమానాలు భరించా.. ఫోటో అడిగితే అవమానించారు.. నటి సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు అభిమానులు వారితో సెల్ఫీలు తీసుకోవడానికి వారిని చూడడానికి ఎగబడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే అభిమానులు చేసే పనికి సెలబ్రిటీలు ఇబ్బంది పడుతూ ఉంటారు.అంతమంది అభిమానులు ఒక్కసారిగా మీదకు వచ్చేసరికి వారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.
అందుకే సినీ తారలు వారి వ్యక్తిగత రక్షణ కోసం బాడీ గార్డ్‌లను నియమించుకుంటారు.
కానీ కొన్ని కొన్ని సార్లు బాడీ గార్డ్ లు చేసే పనుల వల్ల ఆ సెలబ్రిటీలు వార్తల్లో నిలుస్తుంటారు.
"""/" /
ఇటీవల సల్మాన్ ఖాన్( Salman Khan ) బాడీ గార్డ్స్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్( Vicky Kaushal )ను తోసేసిన న్యూస్ నెట్టింట వైరలైన విషయం తెలిసిందే.
దీనిపై విక్కీ వివరణ కూడా ఇచ్చాడు.ఇది ఇలా ఉంటే తాజాగా మరో నటి సల్మాన్ భద్రత సిబ్బంది గురించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
ఇంతకీ ఆ నటి ఎవరూ ఆ నటికీ వారి వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగింది అన్న విషయానికి వస్తే.
దబాంగ్3 సినిమాలో కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ శర్మ( Hema Sharma )ఆ సినిమా నిర్మాణ సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని తాజాగా ఈ నటి గుర్తుచేసుకుంది.
"""/" /
ఈ సందర్బంగా ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.దబాంగ్3 సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాను.
సినిమా షూటింగ్ అయిపోయాక సల్మాన్‌తో ఫొటో కోసం ఎంతో ప్రయత్నించాను.కానీ ఆయన బాడీ గార్డ్స్ నన్ను దారుణంగా అవమానించారు.
కుక్కని తరిమినట్లు తరిమేశారు.ఆ సమయంలో సెట్‌లో కనీసం 100 మంది ఉన్నారు.
వాళ్లందరి ముందు నాతో అలా ప్రవర్తించే సరికి నాకు 10 రోజులు నిద్రపట్టలేదు.
ఆయనతో ఫొటో కోసం నేను ఎంతోమందిని అడిగాను.బిగ్ బాస్‌కు వచ్చినప్పుడు నా కోరిక చెప్పాను అని హేమశర్మ తెలిపింది.
ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ వచ్చేసిందిగా.. ఆ టైటిల్ తో దబిడి దిబిడే!