వైరల్ అవుతున్న మోదీ తల్లి ఫోటో.. మీరు చూశారా ?

ఎందరో హిందువుల కల కు నిన్న పునాది రాయి పడింది.అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది రాయి పడింది.

పవిత్ర స్థలంలో ప్రధాని మోదీ వెండి ఇటుకతో రామమందిర నిర్మాణానికి పునాది రాయి పెట్టాడు.

ఎన్నో తరాలుగా సాగిన పోరాటంకు ప్రతిరూపమే ఈ అమృత ఘడియలు.కరోనా వైరస్ కారణంగా ఎందరో రావాల్సిన భక్తులు అంత కూడా రాలేకపోయారు.

దీంతో ఈ అరుదైన అపురూప దృశ్యాలను కొంతలమంది భారతీయులు టివిలో చూసి ఆనందించారు.

ఇంకా అందులో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కూడా ఒకరు ఉన్నారు.అయోధ్యలో చేరుకున్న మోదీ మొదట హనుమాన్‌గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం రామ్‌ల‌ల్లా ఆల‌యానికి చేరుకొని అక్కడ శ్రీరాముడి విగ్రహం వద్ద సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు.

వీటికి సంబంధించిన దృశ్యాలు అన్ని టీవీలో చుసిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ తన కుమారుడి భక్తికి పరవశించారు.

భక్తి పారవశ్యంతో ఆమె కూడా చేతులు జోడించి నమస్కరించారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేస్తూ.

''ప్రతి తల్లిలోని దైవిక భావన'' అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ ఫోటోను చుసిన నెటిజన్లు సోషల్ మీడియాలో నమస్కరిస్తూ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

జల్సాల కోసం బ్యాంక్‌కి కన్నం … అడ్డంగా దొరికిపోయిన ఎన్ఆర్ఐ భర్త