టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారిన హెబ్బా పటేల్ డేటింగ్ వాఖ్యలు
TeluguStop.com
యంగ్ హీరో రాజ్ తరుణ్ అక్టోబర్ 2న ఒరేయ్ బుజ్జిగా సినిమతో ఆహా ఓటీటీ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని విజయ్ కుమార్ కొండా తెరకెక్కించారు.
లాక్ డౌన్ కి ముందే రిలీజ్ కి రెడీ అయినా ఈ సినిమాని కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తూ వచ్చి చివరికి తప్పనిసరి పరిస్థితిలో ఆహా ఓటీటీ ఛానల్ ద్వారా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లతో ఉన్న రాజ్ తరుణ్ పరంగా సినిమాకి పెద్దగా బజ్ లేకపోయినా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగాయి.
ఇక తాజాగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ఈవెంట్ కూడా నిర్వహించారు.చాలా తక్కువ మంది అతిథులతో ఒక మీడియా సమావేశం మాదిరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో హీరోయిన్ హెబ్బా పటేల్ చేసిన వాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తన కెరీర్లో 90 శాతం సినిమాలు రాజ్ తరుణ్ తో కలిసే నటించానని హెబ్బా పటేల్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఇప్పుడు ఇద్దరం కలిసే ఉంటున్నామని కూడా చెప్పడం విశేషం.ఆమె మాటల బట్టి హెబ్బా పటేల్ తో రాజ్ తరుణ్ డేటింగ్ లో ఉన్నాడనే చర్చ మొదలైంది.
రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ సినిమాతో మొదటి సారి హెబ్బా పటేల్ తో జత కట్టాడు.
తరువాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఒరేయ్ బుజ్జిగా కావడం విశేషం.
ఈ నేపధ్యంలో ఈ భామ ఏదో సరదాగా రాజ్ తరుణ్ పై ఈ రకమైన వాఖ్యలు చేసిందా లేక నిజంగానే ఓపెన్ అయ్యిందా అనే చర్చ కూడా నడుస్తుంది.
అసలే కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో హీరోయిన్ తో డేటింగ్ లు అవసరమా అంటూ రాజ్ తరుణ్ కి సోషల్ మీడియాలో సలహాలు ఇచ్చే వారు కూడా మొదలైపోయారు.
హీరో అంటే ఇలా ఉండాలి.. కటింగ్ మధ్యలో ఆపేసి… ఏం చేశాడో చూడండి!