భీష్మ సినిమాపై హీరోయిన్ గుస్సా.. ఎందుకో తెలుసా?
TeluguStop.com
యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ నేడు ప్రేక్షకుల మందుకు వచ్చింది.
ఈ సినిమాతో నితిన్ అదిరిపోయే హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.
అయితే ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.కుమారి 21F చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హెబ్బా పటేల్, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది.
కానీ అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కలిసి రాలేదు.దీంతో ఈ బ్యూటీ ప్రస్తుతం ఫేడవుట్ హీరోయిన్‌గా మారింది.
దీంతో ఈ బ్యూటీకి భీష్మ చిత్రంలో ఓ కేమియో పాత్రను ఇచ్చారు చిత్ర యూనిట్.
ఈ పాత్ర అమ్మడికి మంచి పేరు తెస్తుందేమో అనుకున్న హెబ్బా, ఆ తరువాత అబ్బా అంటోంది.
ఈ సినిమాలో ఆమె చేసన పాత్ర పెద్దగా ప్రాముఖ్యం లేనిది కావడంతో ఆమె చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.
దీంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా పాల్గొనలేదని తెలుస్తోంది.తనకు మంచి పాత్ర ఇస్తామని చెప్పి, కేవలం కేమియో పాత్రకే పరిమితం చేయడం, ఉన్నదాంట్లో కూడా ఆమె పాత్రను తగ్గించడంతో హెబ్బా భీష్మ చిత్ర యూనిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
మరి ఈ బ్యూటీ కోపానికి గల కారణం ఆమె చేసిన పాత్రనేనా లేక వేరే ఏదైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.
2024 సంవత్సరంలో వెండితెరపై కనిపించని హీరోలు వీళ్లే.. 2025 వీళ్లకు కలిసొస్తుందా?