అమెరికాలో పెనుతుఫాన్.. మొత్తం 2,600 విమానాలు రద్దు!
TeluguStop.com
అమెరికా( America ) పెనుతుఫాన్ గుప్పెట్లో బిక్కు బిక్కుమంటోంది.దాంతో వేలాది విమానాలు రద్దయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలోనే రాజధాని వాషింగ్టన్‌లోని దాదాపు ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మొన్న అనగా సోమవారం తెల్లవారుజామున మూతపడ్డట్టు సమాచారం.
ఇకపోతే అమెరికాకు ఇదేమి కొత్తకాదు.అక్కడ ఈ సీజన్లో అడపాదడపా ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తూనే ఉంటాయి.
కాకపోతే ఈసారి కాస్త ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.సుడిగాలి, కుండపోత వర్షాలు, తుపానులు వచ్చే అవకాశం ఉందని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం.
"""/" /
ఇక ఇప్పటికే వాషింగ్టన్( Washington )లో పాఠశాలలు మూసివేయబడ్డాయి.స్థానిక ప్రజలు బయట వెళ్ళడానికి వీలులేదని, ఇంట్లోనే ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
రాబోయే కొన్ని రోజులు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అమెరికాకు చెందిన వాతావరణ సూచన ఏజెన్సీ సోమవారం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన తుపానులతో కుండపోత వర్షం, టోర్నడోలు, వడగళ్లు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు, తుఫానుల మధ్య అమెరికాలోని చాలా నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
"""/" /
ఇకపోతే, ఈ దారుణ పరిస్థితిలో వర్జీనియా( Virginia )లోని లౌడౌన్ కౌంటీలో సుమారు 15,000 మంది ప్రజలు విద్యుత్తు లేకుండా జీవిస్తున్నట్టు తెలుస్తోంది.
అలబామా నుండి పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రం వరకు సుమారు 29.5 మిలియన్లకు పైగా ప్రజలు సుడిగాలి ప్రమాదంలో ఉన్నారని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికలు జారీ చేసింది.
తుఫాను కారణంగా.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, ఫిలడెల్ఫియా, బాల్టిమోర్‌లలోని విమానాశ్రయాలలో విమానాలను నిలిపివేయాలని ఆదేశించడం జరిగింది.
సోమవారం నాటికి చూసుకుంటే.2,600 కంటే ఎక్కువ US విమానాలు రద్దు చేయబడ్డాయి.
దాదాపు 7,700 US విమానాలు ఆలస్యం అయ్యాయని తెలుస్తోంది.నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.
వాషింగ్టన్ DCతో సహా మధ్య-అట్లాంటిక్ ప్రాంతంలో ప్రమాదం ఉంది.ఇక్కడ కొన్ని ప్రదేశాలలో గంటకు 75 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది.
ప్రభాస్, బన్నీ, తారక్ సాధించారు.. చరణ్ గేమ్ ఛేంజర్ తో లెక్కలు తేలుస్తారా?