ఉత్తరాదిలో భారీ వ‌ర్షాలు

ఉత్త‌రాదిని భారీ వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి.క్లౌడ్ బ‌ర‌స్ట్ మ‌రోసారి బీభ‌త్సం సృష్టిస్తుంది.

జ‌మ్మూకాశ్మీర్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.న‌దులు పొంగి పొర్లుతున్నాయి.

వ‌ర‌ద‌ల‌తో ప‌లు ప్రాంతాలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకుపోయాయి.జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థం అవుతోంది.

వంతెన‌లు కూలిపోవ‌డంతో ప‌లు ప్రాంతాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వ‌ర‌ద బీభ‌త్సానికి ఇప్ప‌టివ‌ర‌కు 22 మంది మృత్యువాత ప‌డ్డారు.

ప‌లువురు గ‌ల్లంత‌య్యారు.కంగ్రా, కులు, మండి, చంబా జిల్లాలను వ‌ర‌ద ముంచెత్తింది.

అటు చంబా జిల్లాలో కొండ చ‌రియలు విరిగి ప‌డుతున్నాయి.అయితే ఆగ‌స్ట్ 25 వ‌ర‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచిస్తుంది.

వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!