ఎల్లో అలెర్ట్ : తెలంగాణ కు ‘ వాన ‘ గండం 

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ  వానలు( Rain ) దంచి కొడుతున్నాయి.అత్యధిక వర్షపాతంతో వాగులు,  వంకలు పొంగిపొర్లుతూ జనవాసాలను ముంచెత్తుతున్నాయి.

అకస్మాత్తుగా వచ్చి పడిన ఈ వరదలు( Floods ) కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించడంతో పాటు,  అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చోటు చేసుకున్నాయి.

అధిక వర్షాలతో చాలాచోట్ల చెరువులకు గండ్లు పడి అనేక జనావాసాలను ముంచేశాయి.ఏపీలో విజయవాడ ప్రాంతం దాదాపు నీట మునిగింది.

అకస్మాత్తుగా వచ్చి పడిన వరదలతో విజయవాడ పట్టణం అతలాకుతలం అయ్యింది.  తెలంగాణలోని( Telangana ) చాలాచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా, రోడ్లపైనే మీరు పొంగి ప్రవహిస్తుంది.

చాలా రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనం విసుగెత్తి పోయారు. """/" / ఇదేలా ఉంటే తెలంగాణకు మరో గండం వచ్చి పడింది.

నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ముఖ్యంగా తెలంగాణలోని 11 జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

ఇప్పటికీ 21 జిల్లాలకు ఎల్లో అలార్ట్ ను( Yellow Alert ) జారీ చేసింది.

హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి , భువనగిరి జిల్లాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

హైదరాబాద్ నగరం లో ( Hyderabad ) నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

"""/" / వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ నగర వాసులతో పాటు,  తెలంగాణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

నేడు హైదరాబాదులో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో జిహెచ్ఎంసి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

నగర ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.ఎక్కడా మ్యాన్ హోల్స్ తెరవ వద్దని, గుంతలను గమనించుకుని ప్రయాణించాలని జిహెచ్ఎంసి( GHMC ) అధికారులు సూచించారు.

ఇప్పటికే ఆకస్మాత్తుగా వచ్చి పడిన వరదలు,  వానలతో తీవ్రంగా నష్టపోయామని మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ ప్రకటించడంతో జనాలు భయాందో ళనలో ఉన్నారు.

వర్షాలు అంటేనే విసుగెత్తిన పరిస్థితి  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం కనిపిస్తోంది.

ఫ్రాన్స్‌లో భారత కొత్త రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా