నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్థం

భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా చిగురుటాకులా వణుకుతోంది.నెల్లూరు సిటీ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.

దీంతో మాగుంట లే అవుట్, ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ ల వద్ద వర్షపు నీరు వచ్చి చేరింది.

ఆత్మకూరు అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది.అదేవిధంగా కావలి వెంగళరావునగర్, వైకుంఠపురంలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు గూడూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

పంబలేరు వాగు, ఉప్పుటేరు వాగులు ఉగ్రరూపాన్ని దాల్చాయి.ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.

విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రోజా….ఈ ట్విస్ట్ ఊహించలేదుగా?