ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు..!

ఏపీ వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటక, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు వ్యాపించాయి.

మరోవైపు విదర్భ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది.

వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదేవిధంగా ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలోనే రాత్రి నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

ఐటీ దాడులపై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు… వాళ్లు సంక్రాంతికే వచ్చారంటూ?