రానున్న 24 గంటల్లో ఏపీ,తెలంగాణకు భారీ వర్షాలు

నల్లగొండ జిల్లా: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ,తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈ ప్రభావంతో కోస్తాంధ్ర,తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.

అటు దక్షిణ అండమాన్‌ సముద్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

భారతీయుడు 2 లో మిస్ అయిన అంశాలు ఇవేనా..?