హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది.

ఈ మేరకు నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో వర్షం కురుస్తోంది.

అదేవిధంగా యూసుఫ్ గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలోనూ వర్షం పడుతోంది.దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండగా కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!