తెలంగాణకు భారీ వర్ష సూచన…!
TeluguStop.com
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రానున్న మూడు రోజుల పాటు వానలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడింది.ఇది రేపు అల్పపీడనంగా మారి మరుసటి రోజు వాయుగుండంగా మారనుంది.
వాయుగుండం ఉత్తరదిశగా పయనిస్తూ తీవ్రమైన తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.