కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి.

వీటి ప్రభావంతో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

అలాగే, చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది.

అటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది.ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొంది.

ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

బాడీలో వ్యర్థాలను బీట్ రూట్ తో తొలగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!