నల్లగొండ జిల్లా: తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రంతా ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం దంచి కొట్టడంతో చాలా జిల్లాల్లో అల్లకల్లోల వాతావరణం ఏర్పడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది.
హైదరాబాద్ లో దాదాపు ప్రళయమే కనిపించింది.చాలా జిల్లాల్లో వరి,మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోగా మామిడి కాయలు నేలరాలాయి.
కాగజ్ నగర్ లో గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు.ఊహించని విధంగా దాదాపు తుఫానులా వర్షం విరుచుకుపడింది.
శనివారం,ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది.వర్షాలకు తోడు ఈదురు గాలులు బీభత్సమే సృష్టిస్తున్నాయి.
చాలా జిల్లాల్లో పెద్ద చెట్టు కూడా నేలకూ లాయి.కరెంటు స్తంభాలు పక్కకు ఒరిగాయి.
వర్షాకాలంలో కూడా ఈ స్థాయి వర్షాలు పడలేదు.అలాంటిది రాత్రి భారీగా కురిసింది.
నిజామాబాద్, ఆదిలాబాద్,ఉమ్మడి మెదక్, కరీంనగర్,పెద్దపల్లి,హైదరాబాద్ ఆ చుట్టు పక్కల జిల్లాలు ఉత్తర తెలంగాణ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ పరిస్ధితిని సమీక్షించి,అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?