Kodiconda Check Post : శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టివేత

శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్( Kodiconda Check Post ) వద్ద భారీగా బంగారం పట్టుబడింది.

ఈ క్రమంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు సుమారు రూ.80 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను పట్టుకున్నారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పట్టుకున్న బంగారం, వజ్రాల పెట్టెలను చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.

అలాగే స్వాధీనం చేసుకున్న బంగారం, వజ్రాలు మలబార్ గోల్డ్ కంపెనీకి( Malabar Gold Company ) చెందినవిగా గుర్తించారు.

మరోవైపు బిల్లులు ఉన్నా అధికారులు ఆపారని మలబార్ గోల్డ్ సిబ్బంది ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అధికారులు బంగారానికి బిల్లులు ఉన్నాయా? లేదా? అనేది నిర్ధారించి పంపుతామని చెబుతున్నారని సమాచారం.

బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!