ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి సీజ్

ఏలూరు జిల్లా( Eluru )లో బంగారం, వెండి భారీగా పట్టుబడ్డాయి.ఈ మేరకు పెదపాడు మండలం కలపర్రు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భాగంగా 16 కేజీల బంగారంతో పాటు 35 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బంగారం, వెండి ఆభరణాలను( Gold And Silver ) సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు.

అనంతరం ఆభరణాలను జిల్లా కార్యాలయానికి తరలించారు.అదేవిధంగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..