ఆయన ఫైట్ కోసం భారీగా ఖర్చు చేశారట.. కానీ ఫ్లాప్ అయ్యింది!

న్యాచురల్ స్టార్ నాని.మోహన కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శ‌కుడిగా 2008లో రొమాంటిక్ కామెడీ తో తెర‌కెక్కించిన అష్టాచ‌మ్మ సినిమాతో ల‌వ‌ర్ బాయ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీగా ఇచ్చాడు.

సోలోగానే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి మీడియం సినిమాల నుంచి స్టార్ హీరోగా టాలీవుడ్ లో స‌త్తా చాటుతున్నాడు.

అష్టాచమ్మాకు ముందు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేయ‌డంతో యాక్టింగ్ లో నేచుర‌ల్ స్టార్ అనిపించుకున్నాడు.

ఇప్ప‌టికి చేసింది 25 సినిమాలే అయినా 2010లో వ‌చ్చిన భీమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు సినిమాతో త‌న‌లోని న్యాచురాలిటీని బ‌య‌ట‌పెట్టాడు.

సినిమా సినిమాకు నాని న‌టన ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయ‌న సినిమాలోని ఒక్కో థీమ్ చెబుతోంది.

ముఖ్యంగా భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టులో ప్ర‌య‌త్నిస్తూ చ‌నిపోవ‌డం.చనిపోయినా కూడా ప్రయత్నించే ఈగ.

! చనిపోతాడని తెలిసి కూడా ప్రయత్నించే జెర్సీ ఇలా నాని సినిమాలోని ఒక్కో థీమ్ తో ఆడియ‌న్స్ ను క‌ట్టిప‌డేస్తున్నాయి.

ల‌వ్, కామెడీ, సెంటిమెంట్ తో అలా మొద‌లైంది, పిల్ల‌జమిందార్, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ‌గాడి వీర ప్రేమగాద‌, ఎంసీఏ, దేవ‌దాస్, జ‌ర్సీ సినిమాల‌తో అభిమానుల్ని క‌ట్టిప‌డేశాడు.

అయితే రీసెంట్ గా వ‌చ్చిన వి సినిమా మాత్రం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది.ఈ సినిమాలో నానీ నెగిటీవ్ షేడ్ లో ఈజీగా ఒదిగిపోయాడు.

సాధార‌ణంగా హీరో అంటే ఓ జానర్ కే ప‌రిమితం అవుతారు.ప‌రిధి దాటితే సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందోన‌ని బ‌య‌ప‌డ‌తారు.

కానీ నాని వి సినిమాలో నెగిటీవ్ షేడ్ లో చ‌క్క‌గా యాక్ట్ చేశాడు.

నానికి పోటాపోటీగా సూప‌ర్ కాప్ గా హీరో సుధీర్ అల‌రించాడు.

యాక్టింగ్ త‌గ్గ‌ట్లు సినిమాలో స్టఫ్ ఉంటే బాగుండేది.నిర్మాణం విష‌యంలో ప్రొడ్యూస‌ర్లు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

హీరోగా, యాక్ట‌ర్ గా మంచి క్రేజ్ ఉన్న సుధీర్ కోసం ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ లో భారీగా ఖ‌ర్చుపెట్టారు నిర్మాత‌లు.

ఆ ఫైట్ సినిమాకి కీ రోల్ ప్లే చేసేది కాబ‌ట్టి అలా ప్లాన్ చేశారు.

నానీ నెగిటీవ్ గా, సుధీర్ సూప‌ర్ కాప్ గా న‌టించిన వి సినిమా విడుద‌లకు ముందు భారీ అంచ‌నాలే ఉన్నాయి.

అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు నానీ, సుధీర్ పోటాపోటీగా యాక్ట్ చేశారు.స్టోరీలో ఆ స్ట‌ఫ్ లేక‌పోవ‌డంతో సినిమా రిజల్ట్ బెడిసికొట్టింది.

తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. భార్యను ఇబ్బందులు పెట్టాడు.. చందు తల్లి ఎమోషనల్ కామెంట్స్!