ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగేవారికి ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
TeluguStop.com
చాలామందికి బీట్ రూట్( Beet Root ) అంటే పెద్దగా ఇష్టం ఉండదు.
దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్ తాగేందుకు అసలు ఇష్టపడరు.కానీ బీట్ రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బీట్ రూట్ గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ తినకుండా అసలు ఉండలేరు.అయితే బీట్ రూట్ ను తినడం ఇష్టం లేనివారు కనీసం దాని జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తాగడమే ఎంతో మంచిది.
దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బీట్ రూట్ జ్యూస్( Beet Root Juice ) వల్ల రక్తహీనతతో బాధపడే వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
దీనివల్ల రక్తం త్వరగా తయారవుతుంది.ఇంకా చెప్పాలంటే రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్రూట్ జ్యూస్ తాగితే రోజంతా హుషారుగా ఉంటారు.
ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా చేస్తారు.హైబీపీ ( High BP ) ఉన్నవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం ఎంతో మంచిది.
బీట్రూట్ లో ఉండే పొటాషియం హైబీపీని అదుపులో ఉంచుతుంది. """/" /
అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ( Cholestrol ) కరిగిపోతుంది.
అంతేకాకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.ముఖ్యంగా చెప్పాలంటే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భిణులకు ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు పోలిక్ యాసిడ్ ఎక్కువగా అందుతుంది.
"""/" /
దీంతో కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక లివర్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం ఎంతో మంచిది.
బీట్రూట్ వల్ల లివర్ శుభ్రం అవుతుంది.లివర్లో ఉండే వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి.
బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మళ్లీ ముద్రగడ లేఖలు ! రెడ్ బుక్ ను ఉద్దేశిస్తూ విమర్శలు