చిరుజల్లులలో మావటితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఏనుగు.. వీడియో వైరల్..

మనుషులకు వేసవి కాలం ఎంత కష్టమో, జంతువులకు కూడా అంతే కష్టంగా అనిపిస్తుంది.

అయితే వానాకాలం( Monsoon ) ప్రారంభమై వర్షాలు పడటం మొదలైతే మనుషులతో పాటు జంతువులకు కూడా ఎంతో హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది.

తాజాగా ఒక ఏనుగు,( Elephant ) తన మావటితో( Mahout ) కలిసి చిరుజల్లులు కురుస్తున్న వేళ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసింది.

వీరి మధ్య ఉన్న స్నేహాన్ని చూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

22 ఏళ్ల వయసున్న ధను పరణ్( Dhanu Paran ) అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ వీడియోను తీశారు.

ఈ వీడియోలో ఒక మావటి తన ఏనుగు పక్కన వర్షంలో నడుస్తున్నట్లు చూడవచ్చు.

మావటి ఏనుగు దంతాన్ని పట్టుకుని, వర్షం పడుతున్న పచ్చటి గడ్డి మైదానంలో వాక్ చేస్తున్నాడు.

ఆ ఎలిఫెంట్ కూడా వర్షాన్ని సుఖంగా ఆస్వాదిస్తోంది.మావటి తన గజరాజును చాలా ప్రేమగా తాకుతున్న తీరు చూస్తే వాళ్ల మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది.

"""/" / ధను పరణ్ అనే వ్యక్తి తమిళనాడులోని అనమలై టైగర్ రిజర్వ్‌లోని కోజికముతి ఎలిఫెంట్ క్యాంప్‌లో( Kozhikamudi Elephant Camp ) ఈ వీడియోను తీశారు.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ, "తమిళనాడులోని అనమలై టైగర్ రిజర్వ్‌లోని( Anamalai Tiger Reserve ) కోజికముతి ఎలిఫెంట్ క్యాంప్‌లో వర్షం పడుతున్న సమయంలో ఒక మావటి, అతని ఏనుగు మధ్య మ్యాజికల్ మూమెంట్స్.

" అని రాశారు.ఈ వీడియో చాలా మందికి నచ్చింది.

దీని కింద కామెంట్లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. """/" / అనేక మంది ఈ వీడియోను చూసి తమ అభిప్రాయాలను తెలియజేశారు.

కొందరు "వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది.ఈ అద్భుతమైన క్షణాన్ని మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు" అని అన్నారు.

మరికొందరు "ఈ వీడియో చాలా అందంగా ఉంది.తమిళనాడులో వన్యప్రాణులను చాలా బాగా సంరక్షిస్తున్నారు" అని చెప్పారు.

ఇంకొకరు "ఏనుగులను ప్రేమగా చూస్తే అవి ఎంత ప్రేమగా ప్రవర్తిస్తాయో చూడండి.నేను కూడా ఒకసారి ఇలా చేయాలనుకుంటున్నాను" అని అన్నారు.

"అద్భుతమైన ఏనుగు, దాని సంరక్షకుడు," "ఇలాంటి మనసుకు హాయినిచ్చే వీడియోలు మరిన్ని షేర్ చేయండి.

ధన్యవాదాలు" అని కొందరు హృదయపూర్వకంగా అన్నారు.ఈ వీడియోను 40,000 మందికి పైగా చూశారు.

సౌదీ అరేబియాకి వెళ్లిన నాలుగో రోజే తెలంగాణ వ్యక్తి మృతి..?