రాత్రి సమయంలో గుండెల్లో మంటగా ఉందా..? అయితే ఇలా చేయండి..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని ఆరోగ్య సమస్యలను( Health Problems ) ఎదుర్కొంటున్నారు.
అందులో ముఖ్యంగా పడుకునే ముందు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
కొందరికి ఎక్కువగా అజీర్ణం, మలబద్ధకం( Constipation ), గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు ఉంటాయి.
అయితే ఛాతిలో లేదా గుండెల్లో కూడా మంటగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
చాలామందికి రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపిస్తుంది.మనల్ని ఇది ఎంతో ఇబ్బంది పెడుతుంది.
అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందో చాలామందికి తెలియదు.పడుకునే ముందు జీర్ణాశయం బయటకు వస్తుంది.
దాంతోపాటు రాత్రి సమయంలో మనం తిన్న కొన్ని ఆహార పదార్థాలు కూడా బయటకు వస్తూ ఉంటాయి.
"""/" /
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్నప్పుడు ఇలాంటి సమస్యలు మనకు సహజంగానే కనిపిస్తాయి.
అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలిసే ఉండదు.ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
చాలామంది రాత్రి సమయంలో డిన్నర్ చేయడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు.అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
పడుకునే సమయానికి రెండు లేదా మూడు గంటల ముందే ఆహారాన్ని తినేయాలి.అప్పుడే రాత్రి పూట గుండెల్లో మంట సమస్య తగ్గుతుంది.
జీర్ణ సమస్యలు( Digestive Problems ) కూడా చాలా తక్కువగా అవుతాయి.
రోజుకి రెండు మూడు సార్లు కాకుండా నాలుగు ఐదు సార్లు తినడం అలవాటు చేసుకోవాలి.
ఇలా తినడం వలన జీర్ణ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. """/" /
చాలామంది రాత్రిపూట ఎక్కువగా తినేస్తూ ఉంటారు.
ఇది అస్సలు మంచిది కాదు.ఆకలికి మించి ఎక్కువగా తింటే చాలా సమస్యలు వస్తాయి.
ఇది గుండెలో మంట రావడానికి కూడా కారణం అవుతుంది.అందుకే రాత్రిపూట మోతాదులో తేలికపాటి ఆహారాన్ని తినాలి.
కొన్ని రకాల ఆహారాలు కూడా గుండెల్లో మంటకు కారణం అవుతాయి.అందుకే మసాలా దినుసులు ఎక్కువగా ఉన్న, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది.
ఇలాంటివి తిన్నప్పుడు గుండెల్లో మంట కలిగెందుకు అవకాశాలు ఉన్నాయి.కాబట్టి ఈ నియమాలు పాటిస్తే గుండెల్లో మంట రావడం తగ్గుతుంది.
మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!