జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆ వార్తల వల్ల ఆమె మనస్తాపం చెందారా?

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గత కొద్దిరోజులుగా జానీ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటొన్నారు జానీ మాస్టర్.

ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంలో మరో విషయం తెరపైకి వచ్చింది.

జానీ మాస్టర్ తల్లి మదర్ బీబ్జాన్ తీవ్ర గుండెపోటుకు గురైనట్లుగా తెలుస్తోంది. """/" / శనివారం ఆమెకు తీవ్ర గుండెనొప్పి రావడంతో వెంటనే బంధువులు నెల్లూరులోని బొల్లినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా ప్రస్తుతం వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు.

ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి వివరాలు తెలియలేదు.అయితే గత కొన్ని రోజులుగా తన కుమారుడు జానీ మాస్టర్‌పై వస్తున్న ఆరోపణలు, కేసు, విచారణ వంటి వాటితో బీబ్జాన్ బాగా భయాందోళనలకు గురైనట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం బీబ్జాన్ పరిస్థితి చూసి కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.అలాగే మరోవైపు జానీ మాస్టర్ కోసం ఆయన భార్య సుమలత పోరాటం చేస్తూనే ఉంది.

తాజాగా జానీ మాస్టర్ కేసు మరో ట్విస్ట్ తీసుకుంది. """/" / ఎవరైతే ఈ కేసులో బాధితురాలుగా చెప్పబడుతుందో, ఆమె తనపై లైంగిక దాడి చేసిందంటూ ఒక యువకుడు ఆమెపై కేసు పెట్టిన విషయం తెలిసిందే.

జానీ మాస్టర్‌ అల్లుడైన షమీర్‌, తన మామ జానీ మాస్టర్‌ తో కలిసి హైదరాబాద్, చెన్నై( Hyderabad, Chennai )లలో షూటింగ్‌ లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని, అప్పుడు తాను మైనర్‌నని చెబుతూ ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయబోతున్నట్లుగా సమాచారం.ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్17, ఆదివారం 2024