సిపిఆర్ తో 50 శాతం గుండెపోటు మరణాలు తగ్గించవచ్చు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సిపిఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడినవారం అవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిపిఆర్ పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ఆకస్మిక గుండెపోటు వల్ల అనేకమంది మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు బాధను కలిగిస్తున్నాయని,ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్డియో పల్మనరీ రీససీటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖతో పాటు సాధారణ ప్రజలందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

జీవన విధానంలో మార్పులు,వాతావరణ మార్పులు,ఆహారపు అలవాట్లు,ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిమాణాలు,పని ఒత్తిడి, పనులలో పోటీ తత్వం, మనిషి యొక్క ఆశలు ఎక్కువగా పెంచుకోవడం వల్ల మనసు మీద ఒత్తిడి ఎక్కువ అవుతుందని, తదితర కారణాలవల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయని పేర్కొన్నారు.

సిపిఆర్ శిక్షణ వల్ల 50 శాతం గుండెపోటు మరణాలను తగ్గించవచ్చన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో వేగంగా మార్పులు తీసుకువచ్చిందని, గతంలో ప్రభుత్వ దవాఖానాలకు పోవద్దని దానిపై పాటలు కూడా పాడేవారని,కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడడంతో ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను వెళుతున్నారని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు బాగా జరుగుతున్నాయని, గతంలో సిబ్బంది కొరత ఉండేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబ్బందిని నియమాకాలు చేపట్టిందని,ప్రభుత్వ దవాఖానాలు ప్రైవేటు దావాఖానాలకు దీటుగా నడుస్తున్నాయని చెప్పారు.

ఆకస్మికంగా వచ్చే గుండెపోట్లను చిన్న ప్రయత్నంతో ఒక ప్రాణాన్ని నిలువచ్చని తెలిపారు.

ఉసిరి పొడి ఉంటే చాలు.. హెయిర్ ఫాల్ కు ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు!