దిశా ఎన్‎కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై నేడు విచారణ

దిశా ఎన్‎కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఈ కేసులో సిర్పుర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా నివేదికపై అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాశ్ రెడ్డిని హైకోర్టు నియమించింది.

ఈ క్రమంలో గతంలో కమిషన్ నివేదికపై ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.ఈ వాదనలలో భాగంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోర్టుకు తెలిపారు.

దీనిపై ఇవాళ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

ముఖం మెడ తెల్లగా అందంగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!