వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తో కలిపి వైఎస్ సునీతా పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తామని తెలిపింది.

జూలై 1న ఎర్ర గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో వైఎస్ సునీత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది.

రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?