వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
TeluguStop.com
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్ రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.
అదేవిధంగా ఇరువర్గాల న్యాయవాదులు కోర్టులో రేపు వాదనలు వినిపించనున్నారు.వాదనలు పూర్తి అయిన తరువాత బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.