నామినేటెడ్ ఎమ్మెల్సీల పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

నామినేటెడ్ ఎమ్మెల్సీలు దాసోజు, సత్యనారాయణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించడంపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆపడానికి వీలు లేదని శ్రవణ్, సత్యనారాయణ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

మరోవైపు ఆర్టికల్ 361 ప్రకారం పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరపు కౌన్సిల్ తెలిపింది.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

వీడియో వైరల్.. ఇది ఆటోనా..? లేక నడిచే డిజిటల్ లైబ్రరీనా?