సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా( Manish Sisodia ) మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court) తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మనీశ్ సిసోడియా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా సుమారు ఏడాది కాలంగా తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

కువైట్ అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు.. పోలీసుల అదుపులో 8 మంది