CJI DY Chandrachud : సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై విచారణ

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.సీజేఐ డీవై చంద్రచూడ్( CJI DY Chandrachud ) నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయింది.

ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను న్యాయవాది వివరిస్తున్నారు.

అయితే గతంలో ఏపీ కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది.తాజాగా ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

"""/" / కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ( Secretary Rajeev Gauba ) నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.

కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా కేంద్రం నియమించింది.

మరోవైపు విచారణలో భాగంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకోనుంది.ఈ నేపథ్యంలో విచారణ పూర్తయిన తరువాత ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాజ్యాంగం అనుమతి ఇస్తుందా? లేదా అన్న దానిపై రాజ్యాంగ ధర్మాసనం స్పష్టత ఇవ్వనుందని సమాచారం.

ఆగస్టు నెలలో సక్సెస్ కొట్టాలని చూస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు…