బిగ్ బాస్ షో నిలిపివేయాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

బిగ్ బాస్ షో నిలిపి వేయాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు ఈనెల 27న కేంద్రం తరపు వాదనలను న్యాయస్థానం విననుంది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 27 కి వాయిదా వేసింది.

బిగ్ బాస్ షోలో ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ను నిర్వాహకులు పాటించలేదని, అదేవిధంగా బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

గత విచారణలో బిగ్ బాస్ షోపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

1970 లలో వచ్చిన సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేసింది.ఈ కేసులో కేంద్రం తరపు న్యాయవాది తన స్పందనకు కొంత సమయం కోరారు.

ఈ క్రమంలో ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.కేంద్రం వాదనలను ఈనెల 27న వింటామని స్పష్టం చేసింది.