ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదితో పాటు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

అటు సీబీఐ కూడా తమ వాదనలను వినిపించింది.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.