ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavitaa )రెగ్యులర్ బెయిల్ పిటిషన్ (Bail Petition )పై విచారణ తేదీ ముందుకు వచ్చింది.

ఈ మేరకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈ నెల 16న విచారణ జరగనుంది.

ఈ నెల 20కి బదులు 16న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.మధ్యంతర బెయిల్ రాకపోవడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను త్వరగా విచారించాలని కవిత కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.

కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..