BRS MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ మరోసారి వాయిదా పడింది.

ఈ మేరకు పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.అనంతరం తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ( ED ) తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోర్టును కోరారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఈ నెల 19వ తేదీన విచారణ చేపడతామని వెల్లడించింది.

దేవర సినిమా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందా..?