ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam )కేసులో అరెస్ట్ అయిన కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.

ఇందులో భాగంగా కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

ఈ క్రమంలోనే కవితకు మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని సింఘ్వి కోరారు.

కాగా కవిత మధ్యంతర, సాధారణ బెయిల్ పై ఈడీ సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది.

ఏంటి గోవా ఒక టూరిస్టు ట్రాపా.. దాన్ని బహిష్కరించాలంటూ నెట్టింట రచ్చ!