కేజ్రీవాల్ హెల్త్ చెకప్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) హెల్త్ చెకప్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరగనుంది.

ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం కావేరి బవేజా పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు.

కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలంటూ నిన్న జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే జైలులో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party ) ఆరోపణలు చేస్తుంది.

రానున్న ఎన్నికల్లో ఓడించలేక కుట్రలు చేస్తున్నారని ఆప్ నేతలు మండిపడుతున్నారు.కేజ్రీవాల్ మూడు వందల పాయింట్లకు పైగా షుగర్ లెవెల్స్ తో బాధపడుతున్నారన్న ఆప్ ఇంటి భోజనాన్ని ఆపేందుకు ఈడీ కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు.

అయితే ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ పొందాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

ఇందుకోసం ఆయన చక్కెర ఎక్కువ ఉండే పదార్థాలను తరచూ తీసుకుంటున్నారని ఈడీ తెలిపింది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది.

స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చిన మహేష్ కొడుకు గౌతమ్.. ఎమోషనల్ అయిన నమ్రత!