గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ నిబంధనలు సడలింపు కేసుపై నేడు విచారణ

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ నిబంధనలు సడలింపు కేసుపై నేడు విచారణ జరగనుంది.

ఉత్తర్వుల జారీపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.గత విచారణలో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కేసులో డిశ్చార్జి పిటిషన్లపై విచారణను త్వరగా ముగించాలని ఆదేశించింది.ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని సీబీఐ అధికారులు నేడు చెప్పనున్నారు.

సీబీఐ నిర్ణయాన్ని బట్టి సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.అయితే, గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ని బీట్ చేస్తుందా..?