Telangana High Court : ఎన్నికల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎన్నికల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో విచారణ జరిగింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్లపై( Election Petitions ) విచారణ జరిపిన హైకోర్టు పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు దానం నాగేందర్, కోవాలక్ష్మీ, మాగంటి గోపీనాథ్ మరియు కూనంనేని సాంబశివరావుకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

అలాగే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.