చంద్రబాబు పిటిషన్లపై మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై మధ్యాహ్నం తరువాత సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.
ఈ పిటిషన్లపై మధ్యాహ్నం తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తామని పేర్కొంది.కాగా కోర్టు నంబర్ ఆరులో 64, 67గా కేసులు లిస్ట్ అయ్యాయి.
ఈ క్రమంలో రెండు కేసులను ఒకే ధర్మాసనం విచారించనుంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇప్పటికే మూడు రోజులపాటు విచారణ జరిగింది.
17ఏ చుట్టూ వాదనలు కొనసాగాయి.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
వైరల్ వీడియో: పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?